Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • 889 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 263 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 5 శాతం వరకు నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ కావడంతో మన ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 889 పాయింట్లు కోల్పోయి 57,011కి పడిపోయింది. నిఫ్టీ 263 పాయింట్లు పతనమై 16,985కి దిగజారింది. ఐటీ, టెక్ మినహా అన్ని సూచీలు నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (2.84%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.96%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.82%), సన్ ఫార్మా (0.61%), టీసీఎస్ (0.16%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.89%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-3.55%), హిందుస్థాన్ యూనిలీవర్ (-3.43%), టైటాన్ (-3.26%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.08%).

  • Loading...

More Telugu News