TVS: సూపర్ హీరోల పేర్లతో టీవీఎస్ కొత్త స్కూటర్లు... ఎలా ఉన్నాయో చూశారా!

- సూపర్ హీరోస్ స్ఫూర్తిగా సూపర్ స్క్వాడ్ ఎడిషన్
- గతేడాది 3 వేరియంట్లు ప్రవేశపెట్టిన టీవీఎస్
- తాజాగా స్పైడర్ మ్యాన్, థోర్ వేరియంట్ల ఆవిష్కరణ
- ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర రూ.84,850
దేశీయ వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ తాజాగా తన పోర్ట్ ఫోలియోలో కొత్త స్కూటర్లను చేర్చింది. వీటిని ఎన్ టార్క్ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ లో భాగంగా తీసుకువచ్చింది. సూపర్ హీరోస్ స్ఫూర్తితో గతేడాది ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా వేరియంట్లను ప్రవేశపెట్టిన టీవీఎస్ తాజాగా స్పైడర్ మ్యాన్, థోర్ వేరియంట్లను పరిచయం చేసింది.

