Posani Krishna Murali: పోసాని వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. చెప్పుతో ఎక్కడ కొట్టాలో చెప్పాలన్న అయ్యన్నపాత్రుడు

Tdp leader ayyanna fires on actor posani
  • జగన్‌కు అధికారం ఇస్తే గొప్పగా అభివృద్ధి చేస్తారన్న పోసాని
  • 2019 ఎన్నికల సమయంలో పలుమార్లు ఇవే వ్యాఖ్యలు
  • మూడేళ్లుగా జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్న అయ్యన్న
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. జగన్‌కు అధికారం ఇస్తే ఏ ప్రభుత్వమూ చేయలేనంత అభివృద్ధి చేసి చూపిస్తారని, లేనపక్షంలో తన ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టాలంటూ 2019 ఎన్నికలకు ముందు పోసాని పలుమార్లు చెప్పుకొచ్చారన్నారు.

ఇప్పుడీ వ్యాఖ్యలను గుర్తు చేసిన అయ్యన్న.. మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుంటే తన ఇంటికి వచ్చి మరీ చెప్పుతో కొట్టాలని పోసాని అన్నారని గుర్తు చేసిన అయ్యన్న.. ఇప్పుడు ఎక్కడ కొట్టాలో చెప్పాలని పోసానిని ప్రశ్నించారు.
Posani Krishna Murali
Ayyanna Patrudu
Telugudesam
Andhra Pradesh
Jagan

More Telugu News