Aadhar Card: ఇక పుట్టిన వెంటనే ఆధార్.. ఆసుపత్రుల్లోనే జారీకి సన్నాహాలు

Aadhara will be issue in hospitals to new borns
  • ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్‌తో పనిలేదు
  • తొలుత కేటాయించి, ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్ సేకరణ
  • రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్‌తో యూఐడీఏఐ సంప్రదింపులు
ఇకపై పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ కార్డు జారీ కానుంది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సన్నాహాలు చేస్తోంది. పుట్టిన వెంటనే ఆసుపత్రులలోనే చిన్నారులకు ఆధార్ కార్డు జారీ చేసే విషయమై రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్‌ విభాగంతో చర్చలు జరుపుతున్నట్టు ఆధార్ సంస్థ సీఈవో సౌరభ్ గార్గ్ తెలిపారు.

ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్ అవసరం లేదు కాబట్టి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి ఆధార్ కార్డుతో దానిని అనుసంధానిస్తామని అన్నారు. ఐదేళ్ల తర్వాత మాత్రం బయోమెట్రిక్ తీసుకుంటామని వివరించారు. ఇప్పటికే దేశంలోని 99.7 శాతం (137 కోట్లు) మందికి ఆధార్ కార్డులు జారీ చేసినట్టు చెప్పారు.  ప్రతి సంవత్సరం రెండు నుంచి రెండున్నర కోట్ల మంది జన్మిస్తున్నారని, వారికి పుట్టిన వెంటనే ఆధార్ జారీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు సౌరభ్ గార్గ్ పేర్కొన్నారు.
Aadhar Card
UIDAI
New Born Baby
Saurabh Garg

More Telugu News