Sri Vishnu: 'అర్జున ఫల్గుణ' విడుదల తేదీ ఖరారు!

Arjuna Phalguna Movie Update

  • 'రాజ రాజ చోర'తో హిట్ కొట్టిన శ్రీవిష్ణు
  • ఆయన హీరోగా మరో సినిమా
  • కథానాయికగా అమృత అయ్యర్
  • ఈ నెల 31వ తేదీన విడుదల

మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. అందువలన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'రాజ రాజ చోర' హిట్ టాక్ ను సంపాదించుకుంది. శ్రీవిష్ణు కామెడీ కూడా బాగా చేస్తాడనే మంచి పేరును తెచ్చిపెట్టింది.

ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన 'అర్జున ఫల్గుణ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా తేజ మార్ని పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు జోడీగా అమృత అయ్యర్ కనిపించనుంది. నరేశ్ .. సుబ్బరాజు .. శివాజీ రాజా .. జబర్దస్థ్ మహేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి ప్రియదర్శన్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి..

Sri Vishnu
Amrutha Ayyar
Naresh
Arjuna Phalguna Movie
  • Loading...

More Telugu News