Cinema Tickets: ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై స్పష్టతనిచ్చిన ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి

AP Home Dept Principle Secretary clarifies on cinema tickets rates issue

  • సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ ఏపీ సర్కారు జీవో
  • జీవో నెం.35పై కోర్టుకు వెళ్లిన థియేటర్ల యాజమాన్యాలు
  • థియేటర్లకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు
  • జీవో నెం.35 అమల్లోనే ఉందన్న హోంశాఖ

ఏపీలో పాత పద్ధతిలోనే సినిమా టికెట్లు అమ్ముకోవచ్చంటూ ఇటీవల న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లపై స్పష్టతనిచ్చారు. ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపునకు సంబంధించిన జీవో నెం.35 అమల్లోనే ఉందని వెల్లడించారు. జీవో 35పై హైకోర్టు తీర్పు పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీలో ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు.

టికెట్ల రేట్ల జీవో నెం.35పై హైకోర్టులో వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు కాగా, 3 పిటిషన్లకు కలిపి ఒకేసారి విచారణ, తీర్పు ఇచ్చినట్టు పేర్కొన్నారు. దాని ప్రకారం... తెనాలిలో 4 థియేటర్లు, చోడవరంలో 1 థియేటర్ కు పాత పద్ధతిలోనే టికెట్ల విక్రయాలకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు కూడా హైకోర్టు తీర్పు వర్తిస్తుందని వెల్లడించారు. ఈ థియేటర్లకు మాత్రమే హైకోర్టు జీవో నెం.35ని సస్పెండ్ చేసిందని హోంశాఖ ముఖ్యకార్యదర్శి వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News