Somu Veerraju: కుళ్లిపోయిన కోడిగుడ్లను పెట్టి విద్యార్థులను ఆసుపత్రులపాలు చేస్తారా?: సోము వీర్రాజు ఫైర్

Somu Veerraju writes letter to Jagan

  • మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తోంది
  • దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి
  • మరోసారి పొరపాట్లు జరగకుండా చూడాలని సీఎంను కోరుతున్నా

కుళ్లిపోయిన కోడిగుడ్లను పెట్టి విద్యార్థులను ఆసుపత్రిపాలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, ప్రతి విద్యార్థికి పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద వేల కోట్ల రూపాయల నిధులను అందిస్తుంటే మీరు కుళ్లిపోయిన కోడిగుడ్లను విద్యార్థులకు పెడుతున్నారని విమర్శించారు. కుళ్లిపోయిన గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై, కుళ్లిపోయిన గుడ్లతో వంట వండే వారిపై చర్యలు తీసుకుని మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సీఎం జగన్ ను కోరుతున్నానని చెప్పారు. ఈ మేరకు జగన్ కు ఆయన బహిరంగలేఖ రాశారు.


Somu Veerraju
BJP
Jagan
YSRCP
Letter
  • Loading...

More Telugu News