Allu Arjun: విజయ్ దేవరకొండ ట్వీట్ కు అల్లు అర్జున్ రియాక్షన్!

Allu arjun reaction to Vijay Devarakonda tweet

  • రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న 'పుష్ప'
  • సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానన్న విజయ్ దేవరకొండ
  • మీ హృదయాలను గెలుచుకుంటామన్న అల్లు అర్జున్

ఇటీవల విడుదలైన 'అఖండ' చిత్రం ఘన విజయాన్ని సాధించింది. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి టాలీవుడ్ లో సరికొత్త జోష్ ను నింపింది. ఇదిలావుంచితే, ఈనెల 17న పాన్ ఇండియా చిత్రంగా 'పుష్ప' విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించింది. సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

మరోవైపు రేపు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'పుష్ప' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని విజయ్ అన్నాడు. ట్రైలర్, పాటలు, విజువల్స్, పర్ఫామెన్స్ అంతా మాస్ అని కితాబునిచ్చాడు. ఇదొక నెక్ట్స్ లెవెల్ తెలుగు సినిమా అని చెప్పాడు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించాడు. అల్లు అర్జున్ అన్న, రష్మిక, సుక్కు సార్ ప్రేమను పంపుతున్నానని చెప్పాడు.

విజయ్ దేవరకొండ ట్వీట్ కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. 'మీ ప్రేమకు ధన్యవాదాలు మై బ్రదర్' అని బన్నీ అన్నాడు. మీ హృదయాలను గెలుచుకుంటామని... శుక్రవారం అందరి రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నామని... 'తగ్గేదే లే' అని ట్వీట్ చేశాడు.

Allu Arjun
Vijay Devarakonda
Pushpa
Tollywood
  • Loading...

More Telugu News