Vizag: కనిష్ఠ‌ ఉష్ణోగ్రత‌లు ప‌డిపోవ‌డంతో చ‌లికి వ‌ణికిపోతోన్న తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు

Winter hits vizag with snow

  • ప్ర‌ధానంగా విశాఖ, లంబసింగిలో కనిష్ఠ‌ ఉష్ణోగ్రత 10 డిగ్రీలు
  • విశాఖ ఏజెన్సీలో పెరిగిన చ‌లి తీవ్ర‌త‌
  • అరకులోయలో 11 డిగ్రీల క‌నిష్ఠ‌ ఉష్ణోగ్రత
  • ద‌ట్ట‌మైన‌ పొగమంచు  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. చ‌లి తీవ్రత మ‌రింత‌ పెరిగిందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ప్ర‌ధానంగా విశాఖ, లంబసింగిలో కనిష్ఠ‌ ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు ప‌డిపోయింది. విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు బాగా త‌గ్గ‌డంతో రాత్రి స‌మ‌యంలో గిరిజనులు చ‌లికి వ‌ణికిపోతున్నారు.

అర‌కు లోయ‌లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతుండ‌డంతో పాటు మంచు కూడా కురుస్తోంది. అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకు లోయలో 11 డిగ్రీల క‌నిష్ఠ‌ ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు చెప్పారు. చలి గాలులు బాగా వీస్తున్నట్లు వివ‌రించారు. ద‌ట్ట‌మైన‌ పొగమంచు ఉంటుండ‌డంతో ఉదయం 9 గంటల వ‌ర‌కు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వ‌చ్చే ప‌రిస్థితి లేదు.

  • Loading...

More Telugu News