Pawan Kalyan: ఆర్టీసీ బస్సు ప్రమాదంపై విచారణ జరిపించాలి: పవన్‌ కల్యాణ్

Pawan Kalyan demands enquiry on RTC bus accident

  • జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు
  • ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం
  • మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని పవన్ డిమాండ్

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. వీరిలో డ్రైవర్ తో పాటు ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను కలచివేసిందని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించాలని అన్నారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

Pawan Kalyan
Janasena
APSRTC
Bus Accident
  • Loading...

More Telugu News