Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లాలో వాగులో పడిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి!

Bus Over Turned Into Stream That Killed 9 Passengers
  • పశ్చిమగోదావరి జిల్లా జల్లేరులో ప్రమాదం
  • ప్రమాద సమయంలో బస్సులో 47 మంది
  • మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జంగారెడ్డిగూడెం డిపో బస్సు వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపుతప్పి జల్లేరు వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 9 మంది చనిపోయారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువున్నారు.  

ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. వాగుపై ఉన్న వంతెనను ఢీకొట్టి వాగులో పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే కొందరు ప్రయాణికులు కిటికీలోంచి దూకి బయటపడ్డారు. బస్సులోని ప్రయాణికులను పడవల సాయంతో స్థానికులు ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.


Andhra Pradesh
Road Accident
Bus
West Godavari District

More Telugu News