Prabhas: 'ప్రాజెక్టు K' విషయంలో అది పుకారేనట!

Project K movie  update

  • నాగ్ అశ్విన్ దర్శకుడిగా 'ప్రాజెక్టు K'
  • నాయకా నాయికలుగా ప్రభాస్, దీపిక
  • మిక్కీ జె మేయర్ ని తప్పించినట్టు ప్రచారం
  • స్వయంగా ఖండించిన మిక్కీ 

ప్రభాస్ ప్రస్తుతం 'ప్రాజెక్టు K' సినిమాను చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా దీపిక అలరించనుంది. ఒక కీలకమైన పాత్రను అమితాబ్ పోషిస్తున్నారు.

ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ ను తీసుకుంటున్నట్టుగా ఆ మధ్య దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పాడు. 'మహానటి' సినిమాకి గాను మిక్కీ జె మేయర్ కి మంచి పేరు వచ్చింది. అయితే ఇంతవరకూ భారీ బడ్జెట్ సినిమాలకు మిక్కీ పనిచేయలేదు. అలాంటిది ప్రభాస్ సినిమా కోసం ఆయనను తీసుకోవడం కొంతమందిని ఆశ్చర్యపరిచింది.

ఈ ప్రాజెక్టు నుంచి మిక్కీని తప్పించారనే ప్రచారం ఇటీవల జరిగింది. అంతా కూడా నిజమేనేమో అనుకున్నారు. కానీ అదంతా పుకారేనని తేలిపోయింది. 'శ్యామ్ సింగ రాయ్' ప్రమోషన్స్ లో మాట్లాడిన ఆయన, తాను చేయనున్న సినిమాల జాబితాలో 'ప్రాజెక్టు K' ఉన్నట్టుగా చెప్పాడు. త్వరలో సంగీత చర్చలు మొదలవుతాయనీ .. ఆ సమయం కోసం వెయిట్ చేస్తున్నానని అన్నాడు.

Prabhas
Deepika Padukone
Amitabh Bachchan
Project K Movie
  • Loading...

More Telugu News