Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎస్సీ, ఎస్టీలు బుద్ధి చెపుతారు: జెడ్పీటీసీ నగేశ్

ZPTC Nagesh serious comments on Komatireddy

  • ఎమ్మెల్సీగా పోటీ చేసిన కాంగ్రెస్ జెడ్పీటీసీ నగేశ్
  • కోమటిరెడ్డి తనకు ఓట్లు వేయొద్దని ఓటర్లకు చెప్పారని మండిపాటు
  • టీఆర్ఎస్ కు కోమటిరెడ్డి అమ్ముడుపోయారని ఆరోపణ

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నగేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదని... మొత్తం ఆరుగురు ఇండిపెండెంట్లం బరిలో నిలిచామని... తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీనని... అయినప్పటికీ తనకు ఓటు వేయొద్దని కోమటిరెడ్డి ఓటర్లకు చెప్పారని మండిపడ్డారు. కోమటిరెడ్డి నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్థికి కేవలం 26 ఓట్లు మాత్రమే వచ్చాయని, తనకు 226 ఓట్లు వచ్చాయని చెప్పారు. కోమటిరెడ్డి వల్లే తనకు అన్యాయం జరిగిందని అన్నారు.
 
కోమటిరెడ్డికి, ఆయన అనుచరులకు టీఆర్ఎస్ పార్టీ ద్వారా కోటి రూపాయలు అందాయని నగేశ్ ఆరోపించారు. టీఆర్ఎస్ కు కోమటిరెడ్డి అమ్ముడుపోయారని విమర్శించారు. కోమటిరెడ్డికి ఎస్సీ, ఎస్టీలు బుద్ధి చెపుతారని అన్నారు. మరోవైపు అన్ని ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Komatireddy Venkat Reddy
Congress
MLC Elections
ZPTC Nagesh
  • Loading...

More Telugu News