Mahesh Babu: యూరప్ లో సర్జరీ చేయించుకుని దుబాయ్ లో రెస్ట్ తీసుకుంటున్న మహేశ్!

Mahesh Babu underwent surgery

  • చాలా కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న మహేశ్ బాబు
  • స్పెయిన్ లో మోకాలికి ఆపరేషన్
  • స్పెయిన్ నుంచి దుబాయ్ కి చేరుకున్న మహేశ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్జరీ చేయించుకున్నారు. చాలాకాలంగా ఆయన మోకాలినొప్పితో బాధ పడుతున్నారు. ఇటీవల షూటింగ్ లో ఆయన మోకాలికి గాయమైంది. దీంతో ఆయన మోకాలి నొప్పి మరింత తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో ఆయన స్పెయిన్ లో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

సర్జరీ తర్వాత ఆయన దుబాయ్ కి వచ్చి, అక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ సర్జరీ కారణంగా 'సర్కారు వారి పాట' షూటింగ్ కు బ్రేక్ పడింది. మహేశ్ పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ మళ్లీ మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. దీంతో షూటింగ్ దాదాపు రెండు నెలల పాటు వాయిదా వేశారు. మరోవైపు మహేశ్ బాబు త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Mahesh Babu
Tollywood
Operation
Spain
Dubai
  • Loading...

More Telugu News