Telangana: ప్రభుత్వ వాదన వినకుండా స్టే ఇవ్వలేం.. ఉద్యోగుల కేటాయింపుపై హైకోర్టు

High Court Issues Notices to Telangana Govt On Employees Allocations

  • నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సర్కారుకు నోటీసులు
  • కేటాయింపుల ప్రక్రియ ఆపాలంటూ 226 మంది టీచర్ల పిటిషన్
  • రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా కేటాయింపులంటూ ఆరోపణ

కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల కేటాయింపును నిలిపేయాలన్న ఉపాధ్యాయుల పిటిషన్ పై స్పందించింది. ప్రభుత్వ వాదన వినకుండా స్టే ఇవ్వలేమంటూ తేల్చి చెప్పింది. 226 మంది ఉపాధ్యాయులు వేసిన పిటిషన్ ను ఇవాళ హైకోర్టు విచారించింది. రాష్ట్రపతి, కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వ జీవోలున్నాయని వారి తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు. కేటాయింపుల ప్రక్రియను పూర్తిగా నిలిపేయాలని కోరారు. అయితే, సర్కారు వివరణ కూడా ఉండాలన్న కోర్టు.. పిటిషనర్ల అభ్యంతరాలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.

  • Loading...

More Telugu News