Atchannaidu: ప్రజా స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌డ‌మే జీవీ ఆంజ‌నేయులు చేసిన త‌ప్పా?: అచ్చెన్నాయుడు

atchennaidu slams ycp

  • విధులకు ఆటంకం కలిగించారంటూ ఈపూరు విద్యుత్ శాఖ ఏఈ ఫిర్యాదుతో కేసు  
  • ఆయ‌న‌పై అక్ర‌మ కేసులు ఎందుకు పెట్టారన్న అచ్చెన్న  
  • అభివృద్ధి వ‌దిలేసి అక్ర‌మ కేసుల న‌మోదుకే స‌మ‌యం వెచ్చిస్తున్నారు
  • టీడీపీ నేత‌లే ల‌క్ష్యంగా జ‌గ‌న్ పాల‌న కొన‌సాగుతోంది

వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. టీడీపీ నేత జీవీ ఆంజనేయులు తన విధులకు ఆటంకం కలిగించారంటూ గుంటూరు జిల్లా ఈపూరు విద్యుత్ శాఖ ఏఈ ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. అయితే, అంగులూరు ఎస్సీ కాలనీకి  విద్యుత్ నిలిపివేయ‌డంతో కాలనీ వాసులతో కలిసి జీవీ ఆంజనేయులు నిరసన దీక్ష చేప‌ట్ట‌డంతో ఆ కాలనీకి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అయిందని అచ్చెన్నాయుడు చెప్పారు. అందుకే ఆయ‌న‌పై పోలీసు కేసు న‌మోదు చేశార‌ని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ప్రజా స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌డ‌మే జీవీ ఆంజ‌నేయులు చేసిన త‌ప్పా? అని అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. ఆయ‌న‌పై అక్ర‌మ కేసులు ఎందుకు పెట్టారు? అని నిల‌దీశారు. వెంట‌నే అక్ర‌మ కేసుల‌ను ఉప‌సంహ‌రించుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

 అభివృద్ధి వ‌దిలేసి అక్ర‌మ కేసుల న‌మోదుకే స‌మ‌యం వెచ్చిస్తున్నారని, టీడీపీ నేత‌లే ల‌క్ష్యంగా జ‌గ‌న్ పాల‌న కొన‌సాగుతోందని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా అక్ర‌మ కేసుల న‌మోదుకే స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నారని దుయ్యబట్టారు. స‌మ‌స్య‌ల పరిష్కారం కోసం పోరాడుతున్న వారిపై త‌ప్పుడు కేసులు పెట్ట‌డం సరికాదని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News