Telangana: తెలంగాణలో కొత్తగా 190 మందికి కరోనా పాజిటివ్
![Telangana Corona Statistics Bulletin](https://imgd.ap7am.com/thumbnail/cr-20211213tn61b771eaae654.jpg)
- గత 24 గంటల్లో 38,187 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,837 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 38,187 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 70 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 198 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,78,478 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,70,633 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,837 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 4,008కి పెరిగింది.
![](https://img.ap7am.com/froala-uploads/20211213fr61b771a7b0661.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20211213fr61b771d3e666b.jpg)