YS Vivekananda Reddy: తనకు ప్రాణహాని ఉందంటూ కడప ఎస్పీ అన్బురాజన్ ను కలిసిన వివేకా పీఏ కృష్ణారెడ్డి

Viveka PA Krishnareddy met Kadapa SP Anburajan

  • 2019లో వైఎస్ వివేకా హత్య
  • కొనసాగుతున్న సీబీఐ విచారణ
  • తనపై కొందరు ఒత్తిడి తెస్తున్నారన్న కృష్ణారెడ్డి
  • గతంలో కృష్ణారెడ్డిని విచారించిన సీబీఐ

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తనకు ప్రాణహాని ఉందని వివేకా పీఏ కృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణారెడ్డి నేడు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను కలిశారు. వివేకా హత్య కేసులో తనపై కొందరు ఒత్తిడి తెస్తున్నారని ఎస్పీకి తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.

వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ నుంచి రాబట్టిన సమాచారంతో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేయడం తెలిసిందే. వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డిని కూడా సీబీఐ అధికారులు గతంలో విచారణకు పిలిచారు.

YS Vivekananda Reddy
PA Krishna Reddy
SP Anburajan
Kadapa District
  • Loading...

More Telugu News