Samantha: సమంత ఐటెం సాంగ్ పై కేసు

Case filed against Samantha item song
  • 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత
  • మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారనే అర్థం వచ్చేలా పాట ఉందన్న పురుషుల అసోసియేషన్
  • పాటను నిషేధించాలని హైకోర్టులో పిటిషన్
ప్రముఖ హీరోయిన్ సమంత 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. సమంత చేసిన 'ఉ అంటావా మావా... ఊఊ అంటావా మామా' పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను ఇటీవలే యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ పాటకు ఫ్యాన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ వచ్చింది.

మరోవైపు ఈ పాటపై ఏపీలోని పురుషుల అసోసియేషన్ కేసు వేసింది. మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారనే అర్థం వచ్చేలా ఆ పాట ఉందని పురుషుల అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటపై నిషేధం విధించాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన 'పుష్ప' చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది.
Samantha
Tollywood
Item Song
Case

More Telugu News