Rashmika Mandanna: ఆ విషయం తెలిసి ఎంతో బాధ కలిగింది: రష్మిక మందన్న

I felt so sad says Rashmika Mandanna

  • నిన్న ఘనంగా 'పుష్ప' ప్రీరిలీజ్ ఈవెంట్ 
  • ఈవెంట్ కు వచ్చిన కొందరు గాయపడ్డారని విన్నానన్న రష్మిక
  • మీరంతా బాగున్నారని భావిస్తున్నానని వ్యాఖ్య

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా రూపొందిన 'పుష్ప' ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న అట్టహాసంగా జరిగింది. అయితే ఈవెంట్ కు హాజరైన కొందరు అభిమానులు గాయపడ్డారు. ఈ ఘటనపై రష్మిక ఆవేదన వ్యక్థం చేసింది. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ.. 'ఈవెంట్ కు హాజరైన అందరికీ ధన్యవాదాలు. మీలో కొందరు గాయపడ్డారని విన్నాను. చాలా బాధేసింది. మీరంతా బాగున్నారని, కేర్ తీసుకుంటున్నారని భావిస్తున్నా' అని వ్యాఖ్యానించింది.

మరోవైపు 'పుష్ప' ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ... ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డామని తెలిపింది. ఈ చిత్రంలో కొత్త ప్రపంచాన్నే సృష్టించామని... 'పుష్ప' అందరినీ అలరిస్తుందని చెప్పింది. ఈ సినిమా కోసం చాలా రోజులుగా తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నానని తెలిపింది.

Rashmika Mandanna
Pre Release
Tollywood
  • Loading...

More Telugu News