Delhi: చలిపులి.. గజగజా వణుకుతున్న ఢిల్లీ!

Lowest temperatures recorded in Delhi
  • కనిష్ఠ స్థాయులకు పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు
  • నిన్న రాత్రి 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలు
దేశ రాజధాని ఢిల్లీపై చలిపులి పంజా విసురుతోంది. చల్లటి గాలులకు ఢిల్లీ గజగజా వణుకుతోంది. నిన్న రాత్రి ఢిల్లీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.4 డిగ్రీలకు పడిపోయాయి. ఈ సీజన్ లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతల కంటే ఇది తక్కువ. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా ఉంది.

మరోవైపు ఈరోజు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 255గా ఉంది. ఇది పూర్ క్వాలిటీ కిందకు వస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫరీదాబాద్ లో 228, ఘజియాబాద్ లో 274, గురుగావ్ లో 200, నోయిడాలో 213గా ఉంది.
Delhi
Temperatute
Minimum Temperature

More Telugu News