Miss Universe 2021: 21 ఏళ్ల తర్వాత భారత ముద్దుగుమ్మకు 'మిస్ యూనివర్స్' కిరీటం.. వీడియో ఇదిగో!

Indias Harnaaz Sandhu wins Miss Universe 2021 title

  • మిస్ యూనివర్స్ టైటిల్ గెలుపొందిన హర్నాజ్ సంధు
  • ప్రపంచ అందగత్తెలతో పోటీ పడిన పంజాబ్ ముద్దుగుమ్మ
  • గతంలో ఈ టైటిల్ గెలుపొందిన సుస్మితాసేన్, లారా దత్తా

విశ్వసుందరిగా భారత సుందరి హర్నాజ్ సంధు అవతరించారు. పంజాబ్ కు చెందిన 21 ఏళ్ల హర్నాజ్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అందగత్తెలు పోటీ పడగా ఆమె విజేతగా అవతరించారు. 21 ఏళ్ల తర్వాత భారత్ కు మళ్లీ విశ్వసుందరి కిరీటం దక్కడం గమనార్హం. చివరిసారి బాలీవుడ్ నటి లారా దత్తా మిస్ యూనివర్స్ టైటిల్ దక్కించుకున్నారు.

మిస్ యూనివర్స్ ఫైనల్స్ లో పరాగ్వేకు చెందిన నాడియా ఫెర్రీరా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలేలా ఎంస్వానేలతో హర్నాజ్ పోటీ పడి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 2020లో విశ్వసుందరిగా ఎంపికైన మెక్సికోకు చెందిన ఆండ్రియా మేజా... హర్నాజ్ కు కిరీటాన్ని అలంకరించారు. చండీగఢ్ కు చెందిన హార్నియా మోడలింగ్ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ఓవైపు చదువుతూనే... మరోవైపు మోడలింగ్ చేస్తూ, అందాల పోటీల్లో పాల్గొంటున్నారు. 2021లో హార్నియా మిస్ దివాగా ఎంపికయ్యారు. 2019లో ఫెమీనా మిస్ ఇండియా పంజాబ్ టైటిల్ ను గెలుచుకున్నారు.

2019 ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో టాప్ 12 స్థానాల్లో నిలిచారు. తాజాగా విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్న హార్నియాపై అభినందనల జల్లు కురుస్తోంది. ఆమె అందానికి అందరూ ముగ్ధులవుతున్నారు. విశ్వసుందరి పోటీల్లో మన దేశం విషయానికి వస్తే 1994లో సుస్మితాసేన్, 2000లో లారా దత్తా ఈ టైటిల్ ను గెలుపొందారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News