Pushpa: హైదరాబాదులో 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం

Pushpa pre release event in Hyderabad

  • అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప'
  • సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా 'పుష్ప'
  • నేడు ప్రీ రిలీజ్ వేడుక
  • యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్

అల్లు అర్జున్ ప్రధానపాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ప్రారంభమైంది. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు భారీగా అభిమానులు తరలివచ్చారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం 'పుష్ప ది రైజ్' గా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా, సమంత నటించిన ఐటం సాంగ్ "ఊ అంటావా మామా ఊఊ అంటావా" పాట ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

'పుష్ప ది రైజ్' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సునీల్, అనసూయ ప్రతినాయక పాత్రలు పోషించగా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది.

Pushpa
Pre Release Event
Allu Arjun
Sukumar
Hyderabad
  • Loading...

More Telugu News