Kerala: కేరళలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

First Omicron case in Kerala

  • కేరళలోనూ ఒమిక్రాన్ కలకలం
  • బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్
  • ఈ నెల 6న కొచ్చి వచ్చిన వ్యక్తి
  • అతడి ఆరోగ్య స్థితి బాగానే ఉందన్న కేరళ ఆరోగ్యశాఖ మంత్రి

కేరళలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేగింది. రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి కొచ్చి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి ఈ నెల 6న బ్రిటన్ నుంచి కొచ్చి వచ్చినట్టు గుర్తించారు. ఈ మేరకు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అతడు కేరళకు చెందినవాడేనని తెలిపారు.

ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్నారు. తాజా ఒమిక్రాన్ కేసు నేపథ్యంలో దేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 38కి పెరిగింది. ఇవాళ ఏపీ, చండీగఢ్, నాగ్ పూర్, కర్ణాటకలో ఒక్కో ఒమిక్రాన్ కేసు నమోదవడం తెలిసిందే.

Kerala
Omicron
First Case
Kochi
UK
  • Loading...

More Telugu News