Road Accident: మద్యం మత్తులో వేగంగా డ్రైవింగ్.. మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

3 Youth Killed In Accident

  • ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడు
  • చనిపోయిన వారి స్వస్థలం విజయవాడ, ఏలూరు

డ్రంకెన్ డ్రైవింగ్ తో ప్రాణాలు పోతున్నా కొందరు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇవాళ కొందరు యువకులు మద్యం తాగి కారును అతి వేగంగా నడిపి ప్రమాదం బారిన పడ్డారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ వద్ద బౌరంపేటలోని కోకాకోల కంపెనీ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు సూరారంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

యువకులంతా హైదరాబాద్ లోని నిజాంపేట్ లో ఉంటూ ఉద్యోగాన్వేషణలో ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను చరణ్, సంజూ, గణేశ్ లుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని అశోక్ గా గుర్తించారు. చరణ్ ది విజయవాడ, సంజూ, గణేశ్ లది ఏలూరు. ప్రమాదం జరిగినప్పుడు చరణ్ కారు నడిపాడని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉండడం, అతివేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని చెప్పారు. కారులోని నలుగురూ మద్యం తాగారన్నారు.

Road Accident
Telangana
Andhra Pradesh
Medchal Malkajgiri District
  • Loading...

More Telugu News