Dharmapuri Arvind: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది: ఎంపీ అర్వింద్

BJP MP Arvind opines on state politics
  • రాష్ట్ర రాజకీయాలపై అరవింద్ వ్యాఖ్యలు
  • రానున్న రోజుల్లో సంచలనాలు జరుగుతాయని జోస్యం
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని వెల్లడి
  •  ఎవరొచ్చినా బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టీకరణ
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. మున్ముందు తెలంగాణలో మరిన్ని సంచలనాలు జరుగుతాయని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుని కలిసి బరిలో దిగే అవకాశముందని అన్నారు. అయితే బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేకంగా దృష్టి సారించిందని అరవింద్ వెల్లడించారు. టీఆర్ఎస్ శాసనసభ్యులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఎవరు వచ్చినా బీజేపీలోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.
Dharmapuri Arvind
BJP
TRS
Congress
Telangana

More Telugu News