Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్.. ప్రభుత్వం బిట్‌కాయిన్లు పంచుతోందంటూ స్కామ్ లింక్ పోస్ట్!

PM Modis Twitter Handle Briefly Compromised

  • బిట్ కాయిన్‌ను ప్రభుత్వం అధికారికం చేసిందని పోస్టు
  • దేశంలోని ప్రతి ఒక్కరికీ 500 కాయిన్ల చొప్పున పంచుతోందంటూ స్కామ్ లింక్
  • ఆ తర్వాత కాసేపటికే ఖాతా పునరుద్ధరణ
  • ఆ పోస్టు పట్టించుకోవద్దన్న పీఎంవో

హ్యాకర్ల బెడద ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాకు కూడా తప్పలేదు. ఆయన వ్యక్తిగత ఖాతాను హ్యాక్ చేసి బిట్‌కాయిన్‌ను ప్రమోట్ చేస్తూ పోస్టు పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన స్క్రీన్‌షాట్ల ప్రకారం.. ప్రభుత్వం బిట్‌కాయిన్లను అధికారికం చేసిందని, దేశంలోని ప్రతి ఒక్కరికి 500 బిట్‌కాయిన్ల చొప్పున పంచుతోందని పోస్టు చేశారు. దానికింద ఓ స్కామ్ లింకు కూడా ఇచ్చారు. అయితే, కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే స్క్రీన్‌షాట్లు జనాల్లోకి వెళ్లిపోయాయి. అంతేకాదు హ్యాక్‌డ్ హ్యాష్ ట్యాగ్ ఇండియాలో ట్రెండింగ్ అయిపోయింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా కొంతసేపు హ్యాక్ అయిందని, ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఖాతాను పునరుద్ధరించినట్టు పీఎంఓ ఇండియా ఈ తెల్లవారుజామున ట్వీట్ చేసింది. హ్యాక్ అయిన సమయంలో షేర్ అయిన ట్వీట్లను పట్టించుకోవద్దని సూచించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News