Ali: జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన సినీ నటుడు అలీ

Jagan ruling is superb says Ali

  • జగన్ పాలన అద్భుతంగా ఉంది
  • అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నారు
  • జగన్ నాకు మంత్రి పదవి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సినీ నటుడు అలీ ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ పాలన చాలా అద్భుతంగా ఉందని ఆయన కితాబునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు జగన్ సమన్యాయం చేస్తున్నారని చెప్పారు. సినిమా టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల వివాదం టాలీవుడ్ కు సమస్యగా మారిందని... దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. జగన్ కూడా దీనిపై సానుకూలంగానే ఉన్నారని చెప్పారు. తనకు కేఎల్ యూనిర్శిటీ డాక్టరేట్ ను ప్రకటించడం సంతోషకరమని అన్నారు. జగన్ తనకు మంత్రి పదవిని ఇస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని నవ్వుతూ చెప్పారు.

Ali
Tollywood
Jagan
YSRCP
  • Loading...

More Telugu News