TTD: సర్వదర్శనాల కోటా పెంపు: పలు కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ బోర్డు!
- ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
- అన్నమయ్య నడకమార్గం అభివృద్ధికి నిర్ణయం
- శ్రీశైల ఆలయ గోపురానికి బంగారు తాపడం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్టు ఈరోజు సమావేశమై కీలక నిర్ణయాలను తీసుకుంది. టీటీడీ తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.
టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు ఇవే:
- వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
- సంక్రాంతి తర్వాత సర్వదర్శనం టోకెన్ల పెంపు
- ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
- భక్తుల సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గం అభివృద్ధికి నిర్ణయం
- వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు వద్ద కొట్టుకుపోయిన ఆలయాల పునర్నిర్మాణం
- ఐటీ విభాగాన్ని పటిష్ఠం చేసేందుకు ఉద్యోగ నియమాకాలు
- రూ. 2.6 కోట్లతో నూతన పరకామణి మండపంలో యంత్రాల కొనుగోలు
- హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం
- నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపదికన మండప నిర్మాణం
- శ్రీశైల ఆలయ గోపురానికి బంగారు తాపడం
- రూ. 10 కోట్లతో స్విమ్స్ లో హాస్టల్ భవనాల నిర్మాణం
- కల్యాణకట్టలో క్షురకులకు ఇచ్చే పీస్ రేటు రూ. 11 నుంచి రూ. 15కి పెంపు
- రూ. 3 కోట్ల వ్యయంతో వసతి గదుల్లో గీజర్ల ఏర్పాటు
- వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యం కల్పించాలని నిర్ణయం.