Chandrababu: 'అఖండ' సినిమా ఎలా ఉందో తన అభిప్రాయాన్ని చెప్పిన చంద్రబాబు
![Akhanda movie is very nice says Chandrababu](https://imgd.ap7am.com/thumbnail/cr-20211211tn61b477776be67.jpg)
- 'అఖండ' సినిమాను చూశానన్న చంద్రబాబు
- రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో సినిమాలో చూపించారని కితాబు
- రాష్ట్రంలో ఏం జరుగుతోందో అద్భుతంగా తెరకెక్కించారన్న బాబు
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వీక్షించారు. తాను 'అఖండ' చిత్రాన్ని చూశానని చంద్రబాబు తెలిపారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో చూపించారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అద్భుతంగా తెరకెక్కించారని కితాబునిచ్చారు. సినిమా చాలా బాగుందని, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇదని అన్నారు. 'అఖండ' సినిమా ఇప్పటికే రూ. 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి... బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.