Sara Ali Khan: విజయ్ దేవరకొండ చాలా హాట్: సారా అలీ ఖాన్

Vijay Devarakonda is very hot says Sara Ali Khan
  • విజయ్ నా ఫేవరెట్ స్టార్ అని చెప్పిన సారా
  • అతనితో కలిసి నటించాలని ఉందని వ్యాఖ్య
  • గతంలో విజయ్ తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసిన సారా
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరుగుతోంది. విజయ్ తో కలిసి నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విజయ్ పై తనకున్న అభిమానాన్ని వెల్లడించింది.

విజయ్ చాలా హాట్ గా ఉంటాడని, కూల్ గా కూడా ఉంటాడని చెప్పింది. అతనితో కలిసి నటించాలని ఉందని తెలిపింది. విజయ్ తన ఫేవరెట్ స్టార్ అని చెప్పింది. గతంలో విజయ్ తో కలిసి దిగిన ఓ సెల్ఫీని సారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పట్లో ఆ ఫొటో వైరల్ అయింది. అంతేకాదు, ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. తాజాగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న 'లైగర్' సినిమా ద్వారా విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.
Sara Ali Khan
Vijay Devarakonda
Tollywood
Bollywood

More Telugu News