Abhinav: డబ్బు చుట్టూ తిరిగే 'కోటేశ్వరరావు గారి కొడుకులు' .. టీజర్ రిలీజ్!

Koteswara Rao Kodukulu Movie Teaser Released

  • తెలుగు తెరకి మరో కొత్త దర్శకుడు
  • నూతన నటీనటులతో సినిమా
  • డబ్బు ప్రధానంగా సాగే కథ
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల తాకిడి పెరిగిపోయింది. కంటెంట్ బాగుంటే పెద్ద సినిమాలతో సమానంగా చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దాంతో కొత్త నటీనటులు .. దర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా రూపొందిన సినిమానే 'కోటేశ్వరరావు గారి కొడుకులు'.

అభినవ్ .. సత్యమణి .. ప్రియాంక .. చందన నాయకా నాయికలుగా నవీన్ రూపొందించిన ఈ సినిమాను, తన్వీర్ నిర్మించాడు. తాజాగా హీరో గోపీచంద్ చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేశారు. "మనకి మంచి జరగాలన్నా .. చెడు జరగాలన్నా దానికి కారణం కచ్చితంగా మనీ అయ్యుంటుంది" అనే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది.

ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం డబ్బు అనే విషయాన్ని స్పష్టం చేసే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన కొడుకులను కోటీశ్వరులుగా చూడాలనుకున్న ఒక తండ్రి ఏం చేస్తాడు?  తండ్రి ముచ్చట తీర్చడానికి ఆ కొడుకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేదే ఈ సినిమా కథ.

  • Error fetching data: Network response was not ok

More Telugu News