RRR: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఎన్టీఆర్ సాయం తీసుకుంటారా? అన్న ప్రశ్నకు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత బదులిదీ!

DVV Danaiah Response On Cinema Ticket Rates In AP
  • ఏపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ కు ఆప్తులున్నారు కదా అన్న విలేకరి
  • ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్న డీవీవీ దానయ్య
  • త్వరలోనే కొలిక్కి వస్తుందని ఆశాభావం
‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అభిమానులకు కనువిందు చేసేలా రెండు పాటలు, ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ లో ఎన్టీఆర్, చరణ్ ల యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ చూసి ఇటు నందమూరి అభిమానులు, అటు మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాను జనవరి 7న విడుదల చేయనున్నారు.

అయితే, ఏపీలో తగ్గించిన సినిమా టికెట్ల రేట్ల విషయంలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్మాత డీవీవీ దానయ్యకు దీనిపైనే ప్రశ్న ఎదురైంది. ‘‘ఏపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ కు ఆప్తులున్నారు కదా.. మరి, సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఎన్టీఆర్ సాయం తీసుకుంటారా?’’ అన్న విలేకరి ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని చెప్పారు. త్వరలోనే ఈ విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు.
RRR
DVV Danaiah
Junior NTR
Andhra Pradesh

More Telugu News