Delhi: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్!

Second Omicron case found in Delhi

  • ఢిల్లీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు
  • దేశంలో 33కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు
  • మహారాష్ట్రలో 17 కేసుల నమోదు

దేశ రాజధాని ఢిల్లీలో రెండో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ వ్యక్తి దక్షిణాఫ్రికాకు కూడా వెళ్లొచ్చారు. దక్షిణాఫ్రికా రిస్క్ దేశాల జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుతో మన దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కు పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబైలో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడటం, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలపై నిషేధం విధించారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 17 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Delhi
Omicron
Second Case
India
  • Loading...

More Telugu News