Andhra Pradesh: రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ నివాసంతో పాటు గంటా సుబ్బారావు ఇంట్లోనూ సీఐడీ సోదాలు

  • ఏపీ నైఫుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్ లో అవ‌క‌త‌వ‌క‌లు?
  • రూ.241 కోట్ల నిధుల దుర్వినియోగం
  • గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ సోదాలు
  • కొన‌సాగుతోన్న ద‌ర్యాప్తు

హైద‌రాబాద్‌లోని రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ నివాసంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఐడీ అధికారులు నిన్న‌ సోదాలు జ‌రిపిన విష‌యం తెలిసిందే. చంద్రబాబు నాయుడి వ‌ద్ద గ‌తంలో ఆయ‌న  ఓఎస్డీగా పనిచేసిన నేప‌థ్యంలో ఆయ‌న ఇంట్లో సోదాలు జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని మ‌రో అధికారి ఇంట్లోనూ సోదాలు చేపట్టడం గ‌మ‌నార్హం.

ఇందుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఏపీ నైఫుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణతో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేశారు. దీనిపైనే సీఐడీ అధికారులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

దర్యాప్తులో భాగంగానే ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అదే సమయంలో.. చంద్రబాబు హయాంలో ఐటీ సలహాదారుగాను, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ సీఐడీ అధికారులు సోదాలు చేశారు. దాదాపు పది గంటల పాటు సోదాలు జరిగాయి. 

  • Loading...

More Telugu News