Vijay: బాధగా ఉందంటూ 'బీస్ట్' పై స్పందించిన పూజ హెగ్డే!

Beast Movie Update

  • విజయ్ హీరోగా రూపొందుతున్న 'బీస్ట్'
  • కథానాయికగా పూజ హెగ్డే
  • నిర్మాణ సంస్థగా సన్ పిక్చర్స్
  • వచ్చే ఏడాదిలో విడుదల

పూజ హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో భారీ విజయాలను నమోదు చేసిన ఈ సుందరి, నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ఇక తమిళనాట అవకాశాలను పెంచుకోవడంతో పాటు, బాలీవుడ్ పై పట్టు బిగించడానికి తనవంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది.

తాజాగా ఆమె తమిళంలో విజయ్ సరసన నాయికగా నటిస్తున్న 'బీస్ట్' సినిమాను గురించి ప్రస్తావించింది. "విజయ్ స్టైల్ .. నెల్సన్ దిలీప్ కుమార్ మార్క్ సినిమా ఇది. ప్రతి ఒక్కరికీ కూడా ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. సెట్లో ప్రతిరోజు షూటింగు ఎంతో సంతోషంగా గడిచిపోయేది. షూటింగుకు వెళుతున్నామా .. వెకేషన్ కి వెళుతున్నామా అన్నట్టుగా ఉండేది.

బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ రోజుతో నా పోర్షన్ పూర్తయింది. ఇక థియేటర్స్ లోనే కలుద్దాం" అంటూ రాసుకొచ్చింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vijay
Pooja Hegde
Nelson Dileep Kumar
Beast Movie
  • Loading...

More Telugu News