Shriya Saran: 'గమనం' సినిమా చూసేందుకు ఆటోలో కూకట్ పల్లి, మల్లికార్జున థియేటర్ కు వచ్చిన శ్రియ

Shriya arrives Mallikarjuna Theater in an auto

  • శ్రియా ప్రధాన పాత్రలో 'గమనం'
  • సుజనా రావు దర్శకత్వం
  • థియేటర్లలో నేడు విడుదల
  • కూకట్ పల్లిలో శ్రియ సందడి

ఒకప్పుడు హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించి, అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించిన శ్రియా శరన్ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో అలరిస్తోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'గమనం' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసేందుకు శ్రియ హైదరాబాదులోని మల్లికార్జున థియేటర్ కు విచ్చేసింది. కూకట్ పల్లిలో ఉన్న థియేటర్ వరకు ఓ ఆటోలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రియా రాకతో సినిమా హాల్ వద్ద సందడి వాతావరణ నెలకొంది.

నూతన దర్శకురాలు సుజనా రావు 'గమనం' చిత్రాన్ని తెరకెక్కించింది. ఇందులో శ్రియాతో పాటు ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్, సుహాస్, రవిప్రకాశ్, శివ కందుకూరి తదితరులు నటించారు. ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. కలి ప్రొడక్షన్స్, క్రియా ఫిల్మ్ కార్ప్ బ్యానర్లపై రమేశ్ కరుటూరి, వెంకీ పుష్పదపు, వీఎస్ జ్ఞానశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Shriya Saran
Auto
Gamanam
Mallikarjuna Theater
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News