RRR: ఏం మాట్లాడాలో కూడా తెలియ‌ట్లేదు: రాజ‌మౌళి

rajamouli on rrr movie trailer

  • ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న‌
  • యూట్యూబ్‌లో ఇప్ప‌టికే తెలుగు ట్రైల‌ర్‌కు 21 మిలియ‌న్ల‌ వ్యూస్
  • టీమ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తోంద‌న్న రాజ‌మౌళి

అభిమానులు ఉత్కంఠ‌తో ఎదురుచూస్తోన్న 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. యూట్యూబ్‌లో ఈ ట్రైల‌ర్ దూసుకుపోతోంది. ఒక్క తెలుగులోనే ఇప్ప‌టికే ఈ ట్రైల‌ర్‌కు 21 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్ క‌న‌ప‌డిన తీరు అభిమానుల‌ను అల‌రిస్తోంది. బాహుబ‌లి వంటి భారీ హిట్ మూవీ అనంత‌రం రాజ‌మౌళి చెర్రీ, తార‌క్ వంటి యంగ్ ఎన‌ర్జిటిక్ హీరోలతో చేసిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

వ‌చ్చేనెల‌ 7వ తేదీన 'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైల‌ర్‌కు భారీ స్పంద‌న వ‌స్తుండ‌డంతో రాజ‌మౌళి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అన్ని ప్రాంతాల నుంచి ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌కు వస్తోన్న స్పంద‌న‌తో తమ టీమ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తోంద‌ని, ఈ భారీ స్పంద‌న ప‌ట్ల ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని చెప్పారు. అంద‌రికీ కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News