Katrina Kaif: అంగరంగ వైభవంగా కత్రిన, విక్కీ కౌశల్ వివాహం.. ఫొటోలు ఇవిగో!

Pics of Katrina Kaif and Vicky Kaushal marriage
  • వైవాహికబంధంతో ఒక్కటైన కత్రిన, విక్కీ
  • పెళ్లికి హాజరైన పలువురు సెలబ్రిటీలు
  • కోవిడ్ నేపథ్యంలో కొద్ది మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వైవాహికబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో వీరి వివాహం వైభవంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యారు. కోవిడ్ నేపథ్యంలో అతికొద్ది మందిని మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు. వీరి వివాహానికి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంట చూడముచ్చటగా ఉందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. పెళ్లి ఫొటోలను మీరు కూడా చూడండి.
 
Katrina Kaif
Vicky Kaushal
Marriage
Photos
Pics

More Telugu News