Katrina Kaif: భార్యాభర్తలుగా మారిన కత్రిన, విక్కీ.. ఫొటో లీక్!

Katrina Kaif and Vicky Kaushal marriage pic

  • వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ప్రేమ జంట
  • అతికొద్ది మంది సమక్షంలో వైభవంగా వివాహం
  • సబ్యసాచి లెహంగాలో మెరిసిపోతున్న కత్రిన

బాలీవుడ్ ప్రేమజంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని సిక్స్ సెన్సెన్స్ ఫోర్ట్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రానప్పటికీ ఒక ఫొటో మాత్రం లీక్ అయింది.

పెళ్లి తర్వాత అందరి ఆశీస్సులు తీసుకుని వస్తున్న జంట ఫొటోను ఎవరో తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో కత్రిన సబ్యసాచి లెహంగాలో మెరిసిపోతుండగా... విక్కీ క్రీమ్ కలర్ షేర్వాణీ, తలకు పాగాతో ఉన్నాడు. ఈ ఫొటో నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొత్త జంటకు నెటిజెన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Katrina Kaif
Vicky Kaushal
Bollywood
Marriage
Photo
Pic
  • Loading...

More Telugu News