Balakrishna: నైజామ్ లో 'అఖండ' వారంరోజుల వసూళ్లు!

Akhanda movie update

  • ఈ నెల 2న విడుదలైన 'అఖండ'
  • నైజామ్ లో 14.8 కోట్ల షేర్
  • ఓవర్సీస్ లోను అదే జోరు 
  • సంగీత దర్శకుడిగా తమన్  

బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కించిన 'అఖండ' భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సినిమాలో బాలకృష్ణను బోయపాటి అఘోరగా చూపించనున్నాడనే టాక్ వచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఇలాంటి పాత్రలను పోషించడానికి ఎవరూ ముందుకురారు కదా అనుకున్నారు.

కానీ బోయపాటి 'అఘోర'గా బాలకృష్ణ పాత్రను గొప్పగా డిజైన్ చేశాడు. బాలకృష్ణ కెరియర్లోనే బెస్ట్ గెటప్పుగా సినీ ప్రముఖులు సైతం చెబుతున్నారు. కథాకథనాలు .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి బలమైన ఆకర్షణగా నిలిచాయి. ఈ మధ్య కాలంలో ఓవర్సీస్ లో కూడా సందడి చేస్తున్న బాలకృష్ణ సినిమా ఇదేనని అంటున్నారు.

విడుదలైన తొలి రోజు నుంచి ఈ సినిమా నైజామ్ లో భారీ వసూళ్లను రాబడుతూ వెళుతోంది. ఈ నెల 2వ తేదీన విడుదలైన ఈ సినిమా, వారం రోజుల్లో నైజామ్ లో 14.8 కోట్ల షేర్ ను రాబట్టిందని చెబుతున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.

Balakrishna
Pragya Jaiswal
Srikanth
Akhanda movie
  • Loading...

More Telugu News