Shriya Saran: మరో 20 ఏళ్లు నటించాలని ఉంది: శ్రియ

Gamanam movie update

  • ఈ నెల 10వ తేదీన 'గమనం' విడుదల
  • కథ వినగానే కన్నీళ్లు పెట్టుకున్నాను
  • కమల పాత్రలో కనిపిస్తాను
  • ఏఎన్నార్ లా చివరివరకూ నటించాలని ఉంది

శ్రియ .. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఏ ముహూర్తాన ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో తెలియదు గానీ, అప్పటి నుంచి ఇంతవరకూ ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. కొంతకాలం క్రితం ఆమె చేసిన 'గమనం' సినిమా, ఈ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో శ్రియ మాట్లాడుతూ .. " ఈ కథ నాకు బాగా కనెక్ట్ అయింది. దర్శకురాలు సుజనరావు కథ చెబుతూ ఉండగానే నాకు కన్నీళ్లు వచ్చేశాయి. ఈ సినిమాలో నేను వినికిడి లోపం కలిగిన కమల అనే పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర కోసం నేను కుట్టు మిషన్ నేర్చుకున్నాను. ఈ మధ్య కాలంలో నేను చేసిన చెప్పుకోదగిన పాత్రలలో ఇది ఒకటి.

నా కెరియర్ లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని భావిస్తున్నాను. అప్పుడే నా కెరియర్ ను మొదలుపెట్టేసి 20 ఏళ్లు పూర్తయ్యాయంటే నాకే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇంతకాలం పాటు ఇక్కడ నిలబడతానని ఎప్పుడూ అనుకోలేదు. అక్కినేని నాగేశ్వరరావుగారిలా చివరివరకూ నటించాలని ఉంది. కనీసం మరో 20 ఏళ్ల పాటైనా ఇలా మిమ్మల్ని అలరించాలని ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.

Shriya Saran
Shiva Kandukuri
Priyanka Jawalkar
Gamanam Movie
  • Loading...

More Telugu News