Nara Lokesh: జల ప్రళయానికి కారణమైన వారికి ప్రభుత్వమే అండగా నిలవడం బాధాకరం: నారా లోకేశ్

Nara Lokesh slams YCP Govt

  • కడప జిల్లాలో జలవిలయం
  • 39 మంది చనిపోయారన్న లోకేశ్
  • జగన్ కు జనం కంటే ధనమే ముఖ్యమని విమర్శలు
  • గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయని ఆరోపణ  

కడప జిల్లాలో వరద బీభత్సం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైసీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోందని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల కన్నీళ్లు ఆరకముందే గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయని ఆరోపించారు. దీన్నిబట్టి జగన్ కు జనం కంటే ధనమే ముఖ్యమని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతల ధనదాహానికి 39 మంది జలసమాధి అయ్యారని, 12 గ్రామాలు నీట మునిగాయని, రూ.1,721 కోట్ల నష్టం వాటిల్లిందని లోకేశ్ పేర్కొన్నారు. బాధితులకు కనీస న్యాయం జరగకముందే కడప జిల్లా నందలూరు మండలం అడవూరు క్వారీలో ఇసుక విక్రయాలు ప్రారంభించారని ఆరోపించారు. జలప్రళయానికి కారణమైన ఇసుక మాఫియాని కట్టడి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలవడం బాధాకరమని పేర్కొన్నారు.

Nara Lokesh
YCP Govt
Kadapa District
Sand
Annamayya Project
  • Loading...

More Telugu News