శేఖర్ కమ్ముల ఇంటిచుట్టూ తిరిగాను: నాగశౌర్య
- 'హ్యాపీడేస్' తెగ నచ్చేసింది
- శేఖర్ కమ్ముల కళ్లలో పడాలనుకున్నాను
- ఆయనతో ఒక సినిమా చేయాలనుంది
- ఆయన ఎప్పుడంటే అప్పుడేనన్న నాగశౌర్య
పద్మారావునగర్ లో ఆయన ఉంటారని తెలుసుకుని .. అడ్రెస్ పట్టుకుని వెళ్లాను. ఆయన నన్ను చూడటం ఆలస్యం సినిమాల్లోకి తీసుకుంటారనే ఒక ధీమాతో ఉండేవాడిని. ఆయన కంట్లో పడాలని ఆయన ఇంటిముందు బైక్ పై అటూ ఇటూ తిరిగేవాడిని. డాబాపై ఆయన స్క్రిప్ట్ రాసుకుంటూ ఉండేవారు.
ఎన్నిసార్లు ఆయన ఇంటి ముందు తిరిగినా .. ఎన్నిసార్లు హారన్లు కొట్టినా ఆయన ఎప్పుడూ నా వైపు చూడలేదు. ఆయన తన పనిని ఎంత అంకితభావంతో చేస్తారనేది నాకు అర్థమైంది. ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనుంది. ఆయన ఎప్పుడంటే అప్పుడే చేయడానికి నేను రెడీగా ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలో నాగశౌర్య కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి.