Indonesia: ఇండోనేషియాలో 6.0 తీవ్రతతో భారీ భూంకంపం

Tremors in Indonesia

  • ఇండోనేషియాలో భారీ భూకంపం
  • ఉదయం 5.17 గంటలకు ప్రకంపనలు
  • టోబెలో ప్రాంతానికి 259 కిమీ దూరంలో భూకంప కేంద్రం

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.0గా నమోదైంది. ఉదయం 5.17 గంటలకు భూమి కంపించిందని ఇండోనేషియా వర్గాలు వెల్లడించాయి. ఇండోనేషియాలోని టోబెలా ప్రాంతానికి 259 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జీఎస్ (యూఎస్ జియోలాజికల్ సర్వే) పేర్కొంది.  

భూమి లోపల 174.3 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. ప్రాణ, ఆస్తి నష్టం, సునామీ హెచ్చరికల వంటి వివరాలు తెలియరాలేదు.

Indonesia
Earthquake
Tremors
USGS
  • Loading...

More Telugu News