Mummy: పెరూలో బయటపడ్డ వెయ్యేళ్ల నాటి మమ్మీ... ఎలా ఉందో చూడండి!

Thousand years aged Mummy found in Peru

  • లిమా నగరం సమీపంలో తవ్వకాలు
  • భూగర్భంలో మమ్మీ
  • 1,200 ఏళ్ల నాటిదని భావిస్తున్న పరిశోధకులు
  • తాళ్లతో కట్టివేసి ఉన్న స్థితిలో మమ్మీ

పురాతన కాలంలో ఈజిప్టులో రాచరికపు వ్యక్తులు మరణించినప్పుడు వారిని మమ్మీలుగా మార్చి భద్రపరిచేవారు. ఇవి కొన్ని వేల సంవత్సరాలు గడచినప్పటికీ కుళ్లిపోకుండా ఉంటాయి. తాజాగా పెరూలో ఓ మమ్మీ బయల్పడింది. పెరూ రాజధాని లిమా సమీపంలో పురావస్తు శాస్త్రజ్ఞులు చేపట్టిన తవ్వకాల్లో దీన్ని గుర్తించారు. ఈ మమ్మీ 800 నుంచి 1,200 ఏళ్ల నాటిది అయ్యుండొచ్చని అంచనా వేస్తున్నారు.

కజామార్క్విల్లా ప్రాంతంలో ఇటీవల శాన్ మాక్రోస్ నేషనల్ యూనివర్సిటీ తవ్వకాలు చేపట్టింది. భూగర్భం లోపల భద్రపరిచి ఉన్న ఈ మమ్మీ తాళ్లతో కట్టివేసి ఉన్న స్థితిలో కనిపించింది. దక్షిణ పెరూలో ఇదొక అంత్యక్రియల ఆచారం అని పరిశోధకులు వెల్లడించారు. ఈ మమ్మీ ఇక్నా నాగరికతకు ముందు కాలం నాటిది అని వారు చెబుతున్నారు.

హిస్పానిక్ కాలం ముందునాటి పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు ఈ మమ్మీ దోహదపడుతుందని పీటర్ వాన్ డాలెన్ లూనా అనే ఆర్కియాలజిస్టు తెలిపారు. తాము కనుగొన్న మమ్మీ 25 నుంచి 30 ఏళ్ల వయసున్న ఓ యువకుడిదిగా భావిస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News