BSA: రాయల్ ఎన్ ఫీల్డ్ కు బీఎస్ఏ పోటీ... భారత రోడ్లపై బ్రిటన్ బైకులు!

BSA unveils Goldstar bike

  • బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 ఆవిష్కరణ
  • బర్మింగ్ హామ్ ఎక్స్ పోలో ప్రదర్శించే అవకాశం
  • 650 సీసీ ఇంజిన్ తో గోల్డ్ స్టార్ బైక్
  • భారత్ లో సైకిళ్ల వ్యాపారంతో బీఎస్ఏకి గుర్తింపు

బర్మింగ్ హామ్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీ లిమిటెడ్... సంక్షిప్తంగా బీఎస్ఏ. బ్రిటన్ కు చెందిన ఈ సంస్థ చాన్నాళ్లుగా భారత్ లో సైకిళ్ల వ్యాపారం చేస్తోంది. సైకిళ్లే కాదు బైకులు కూడా తయారు చేస్తుందీ సంస్థ. వందేళ్ల కిందట మోటార్ సైకిల్ రూపొందించిన ఘనత బీఎస్ఏ సొంతం. తాజాగా తన కొత్త మోడల్ బైకులను భారత్ లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇటీవలే బీఎస్ఏ తన లేటెస్ట్ మోడల్ గోల్డ్ స్టార్ 650ని ఆవిష్కరించింది. డిసెంబరు 4 నుంచి 12వ తేదీ వరకు బర్మింగ్ హామ్ లో జరిగే ఎక్స్ పోలో తన కొత్త మోడల్ ను ప్రదర్శించనుంది. బీఎస్ఏ గోల్డ్ స్టార్... భారత్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్, రాయల్ ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 మోడళ్లకు గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
గోల్డ్ స్టార్ బ్రాండ్ 1938-63 మధ్య కాలంలో అనేక దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. 350 సీసీ-500సీసీ రేంజ్ లో ఇది పేరెన్నికగన్న బైక్ గా మన్ననలు అందుకుంది. ఈ బ్రాండ్ ను బీఎస్ఏ చేజిక్కించుకుంది. పాత డిజైన్ లో పెద్దగా మార్పులు చేయకుండా, ఇంజిన్ ను మాత్రం 650 సీసీతో శక్తిమంతం చేసింది. ఈ కొత్త బైక్ లో 650 సీసీ సింగిల్ సిలిండర్ డీఓహెచ్ సీ ఇంజిన్ అమర్చారు. ఈ బైక్ ను బ్రిటన్ లో డిజైన్ చేశారు. ఉత్పత్తి కూడా బ్రిటన్ లోనే ఉంటుందని మార్కెట్ వర్గాలంటున్నాయి. బీఎస్ఏ బైకులను క్లాసిక్ లెజెండ్స్ సంస్థ మార్కెటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News