Team India: ముంబయి టెస్టులో ముగిసిన రెండోరోజు ఆట... తిరుగులేని పొజిషన్ లో టీమిండియా

Team India tightens grip on Mumbai Test

  • టీమిండియా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు
  • వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 325 ఆలౌట్
  • అజాజ్ పటేల్ కు 10 వికెట్లు
  • అద్భుత ఘనత సాధించిన స్పిన్నర్
  • తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 62 రన్స్ కే ఆలౌట్

ముంబయి టెస్టులో టీమిండియా విజయం దాదాపు ఖాయమైనట్టే! ఏదైనా అద్భుతం జరిగితే తప్ప న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో గట్టెక్కడం అసాధ్యం. కివీస్ ను తొలి ఇన్నింగ్స్ లో 62 పరుగులకే కుప్పకూల్చిన భారత్ ఆపై తన ఆధిక్యాన్ని 332 పరుగులకు పెంచుకుంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ సేన రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 38, ఛటేశ్వర్ పుజారా 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రేపు తొలి సెషన్ అనంతరం టీమిండియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటకు ఇంకా మూడ్రోజుల సమయం ఉండడంతో కివీస్ శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది.

ముంబయి వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (150) అద్భుత సెంచరీ సాయంతో భారత్ 325 పరుగులు చేయగలిగింది. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన మూడో బౌలర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్... భారత బౌలర్ల దాటికి కకావికలమైంది. అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ 1 వికెట్ తీసి కివీప్ రెక్కలు విరిచారు. పర్యాటక జట్టు ఫాలో ఆన్ కు చాలాదూరంలో నిలిచిపోయినప్పటికీ, టార్గెట్ నిర్దేశించడం కోసం టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయించుకుంది.

  • Loading...

More Telugu News