Uttar Pradesh: తప్పుడు ఫోన్ నంబర్లు, అడ్రస్ లు ఇచ్చిన విదేశాల నుంచి వచ్చిన 13 మంది!

13 people came from abroad given wrong address and phone numbers

  • దక్షిణాఫ్రికా నుంచి మీరట్ కు వచ్చిన 297 మంది
  • తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు
  • ఇంటెలిజెన్స్ టీమ్ కు వివరాలు ఇచ్చామన్న జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్

కొందరు వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ సమాజానికి చేటు కలిగేలా వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ముఖ్యంగా రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే టెస్టులు నిర్వహిస్తున్నారు. వీరి చిరునామాలు, ఫోన్ నంబర్లను తీసుకుని పంపిస్తున్నారు. వీరి రిపోర్టుల్లో పాజిటివ్ వస్తే వెంటనే వారిని ట్రేస్ చేసి క్వారంటైన్ కు పంపించడానికి ఇదంతా చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం తప్పుడు అడ్రస్, ఫోన్ నంబర్లు ఇస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ల్యాండ్ అయిన 297 మంది ప్రయాణికుల్లో 13 మంది తప్పుడు ఫోన్ నంబర్లు, చిరునామాలు ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఖిలేశ్ మోహన్ వెల్లడించారు. ప్రస్తుతం వీరిని ట్రేస్ చేసే పనిలో ఉన్నామని తెలిపారు. వారిని గుర్తించేందుకు గాను స్థానిక ఇంటెలిజెన్స్ టీమ్ కు వివరాలను అందించామని చెప్పారు. వీరంతా కూడా దక్షిణాఫ్రికా నుంచి వచ్చారని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ను తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News