rain: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు.. అప్రమత్తంగా ఉండాల‌న్న క‌లెక్ట‌ర్ శ్రీకేష్

rains in ap

  • శ్రీకాకుళం జిల్లా ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు
  •  ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయ‌కూడ‌దు
  • శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను భారీ వ‌ర్షాలు వ‌ద‌ల‌డం లేదు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయొద్దని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ సూచించారు. అలాగే, నదీపరీవాహక, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

తుపాను ప్రభావాన్ని ప్రత్యేక అధికారి అరుణ్‌కుమార్‌ సమీక్షిస్తున్నట్లు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని తెలిపారు.

సాయం కోసం కంట్రోల్ రూం నంబ‌ర్లు:

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నంబరు: 08942 240557
పాలకొండ డివిజన్ (ఆర్డీవో) కంట్రోల్ రూమ్ నంబరు: 08941-260144, 9493341965
టెక్కలి డివిజన్ (ఆర్డీవో) కంట్రోల్ రూమ్ నంబరు: 08945-245188
శ్రీకాకుళం డివిజన్ (ఆర్డీవో) కంట్రోల్ రూమ్ నంబరు: 8333989270

rain
Srikakulam District
Andhra Pradesh
  • Loading...

More Telugu News